వృక్షాకాంక్ష
ప్రకృతి సంపదను కొలగొట్టి విర్రవీగితివి మానవా!
ప్రకృతి సంపదకు మూలం నేనని తెలియలేదా నీకది,
జ్ఞానశక్తిని నీకనిచ్చిన జగతినేమరచి నీవు,
తనదు వినాశము జేసుకొన్న భస్మాసురుని మించినాడవు,
చెట్టునీడన చేరనట్టి జీవజాలమెక్కడుంది?
జీవజాతిని నిలబెట్టునట్టిది చెట్టు ఒక్కటేనని తెలుసుకో !
మణిమాలిక లో ఫోటో వ్యాఖ్యా...~04/10/2012