Saturday, November 24, 2012

Manchu Buduga

          కన్నెచేతిలో మంచు బుడుగ
.
క్షణమైన జీవితం లో ఆనందం పంచమని
దివి నుండి భువికైన పరుగుపరుగున చేరివచ్చి
ప్రకృతిలో మమైకమై మంచు బుడుగ జీవితాన్ని
కన్నె పిల్ల చేతిలోన కరిగిపోవుటే ధన్యతనియే.
{ఫోటో వ్యాఖ్యా} 24/11/12 @4.58 pm

Thursday, October 4, 2012

The value of Tree


                   
వృక్షాకాంక్ష

ప్రకృతి సంపదను కొలగొట్టి విర్రవీగితివి మానవా!
ప్రకృతి సంపదకు మూలం నేనని తెలియలేదా నీకది,
జ్ఞానశక్తిని నీకనిచ్చిన జగతినేమరచి నీవు,
తనదు వినాశము జేసుకొన్న భస్మాసురుని మించినాడవు,
చెట్టునీడన చేరనట్టి జీవజాలమెక్కడుంది?
జీవజాతిని నిలబెట్టునట్టిది చెట్టు ఒక్కటేనని తెలుసుకో !


మణిమాలిక లో ఫోటో వ్యాఖ్యా...
~04/10/2012